విశాఖ వాసులను భయపెడుతున్న స్క్రబ్ టైఫస్

విశాఖ వాసులను భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
x
Highlights

కరోనా కరాళ నృత్యం చేస్తూనే ఉంది విశాఖలో మరో కొత్త వైరస్ దాడి చేయబోతోంది స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియా ఏజెన్సీలో డెంజర్ బెల్స్...

కరోనా కరాళ నృత్యం చేస్తూనే ఉంది విశాఖలో మరో కొత్త వైరస్ దాడి చేయబోతోంది స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియా ఏజెన్సీలో డెంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇప్పటికే ఇది కొంతమంది పై ప్రభావం చూపిస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ద్వారా వైరల్ ఫీవర్ వస్తే ప్రమాదం తప్పదంటున్నారు వైద్యులు. విశాఖలో కొత్త వైరస్ వర్రీ పై హెచ్.ఎమ్.టీవీ స్పెషల్ రిపోర్ట్.

కరోనాతో పాటు మరో కొత్త వైరస్ విశాఖ వాసులను భయపెడుతుంది. స్క్రబ్ టైఫస్ అనే జీవి పురుగు మాదిరిగా ఉంటుంది. ఇది మురుగు నీరు నిల్వ ఉన్న చోట, పచ్చికబీళ్ళు ఎక్కువుగా వున్న ప్రాంతాలలో జీవిస్తుంది. స్క్రబ్ టైఫస్ మనిషి మీద దాడి చేస్తే మొదట శరీరం మీద దద్దుర్లు రావడం తర్వాత జ్వరం రావడం దీని ప్రధాన లక్షణం. జ్వరం ఎక్కువ అయినా వైరస్ ను గుర్తించడం ఆలస్యం అయినా మనిషి శరీరంలో మూత్రపిండాలు, గుండె, కాలేయం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇది కరోనా మాదిరి తీవ్రమైన వైరస్ కాదని, ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం కూడా లేదని వైద్యులు అంటున్నారు.

విశాఖ ఏజెన్సీలో ఇటీవల ముగ్గురు వ్యక్తులు మరణించారు. మొదట కోవిడ్ లక్షణాలుగా భావించి వైద్యులు చికిత్స అందించారు. అయితే వారికి టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది కానీ లక్షణాలు అవే వుండటం ముగ్గురిలోనే ఒకరకమైన సిమ‌్‌టమ్స్ కనిపించడంతో జిల్లా వైధ్యాధికారులకు తెలియజేశారు. సహజంగా విశాఖ ఏజెన్సీలో ఆగస్టు నుండి జనవరి వరకు జ్వరాల తీవ్రత అధికంగ ఉంటుంది. అయితే మలేరియా, డెంగ్యూ వంటివి కూడా నిర్థారణ కాకపోవడంతో కొంతమంది నిపుణులు ఈ లక్షణాలు వేటిద్వారా కలుగుతాయని స్టడీ చేయగా స్క్రబ్ టైఫస్ గురించి తెలిసింది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ ను వెంటనే గుర్తిసతే చిన్న యాంటీ బయోటెక్ ఇంజక్షన్ తో మాయం చేయవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఒక పక్క కరోనా కల్లోలం ప్రజలను భయపెడుతున్న సమయంలో ఇలాంటి కొత్త వ్యాధుల నుండి బయటపడాలంటే ఒకటే మార్గం. స్వీయ రక్షణ, పరిశుభ్రత మాత్రమే ప్రస్తుతం ఆయుధం. అందుకే అందరూ పరిశరాలను శుభ్రంగా ఉంచుకుని మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories