AP Schools Reopen: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు రీఓపెన్‌

AP Schools Reopen: ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం * ఆగస్టులోపు నాడు-నేడు పనులను పూర్తిచేయాలని సీఎం ఆదేశం

Sandeep Eggoju
Updated on: 7 July 2021 1:49 PM IST
Schools Reopen in Andhra Pradesh From August16th
X

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రి ఓపెన్ (ఫైల్ ఇమేజ్)

AP Schools Reopen: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు పునఃప్రారంభిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నట్టు ఆయన ప్రకటించారు. ఆగస్టులోపు నాడు-నేడు పనులను పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని, దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నట్టు మంత్రి సురేష్‌ చెప్పారు. ఇక.. 30 శాతం పదోతరగతి, 70 శాతం ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల ప్రాతిపదికన.. ఇంటర్‌ విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్‌ విద్యార్థులకు మెమోలు జారీ చేస్తామని వివరించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story