ఏపీలో ఇవాళ్టి నుంచి మోగనున్నబడిగంటలు...

ఏపీలో ఇవాళ్టి నుంచి మోగనున్నబడిగంటలు...
x
Highlights

కరోనా కల్లోలం నుంచి కుదుటపడుతున్న వేళ పాఠశాలలను పునః ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. నవంబర్‌ 2 నుంచి దశలవారీగా తరగతులను నిర్వహించేందుకు రంగం...

కరోనా కల్లోలం నుంచి కుదుటపడుతున్న వేళ పాఠశాలలను పునః ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. నవంబర్‌ 2 నుంచి దశలవారీగా తరగతులను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు ఏడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థలను మార్చిలోనే మూసివేశారు. తాజాగా, పాఠశాలలు, కాలేజీల పునఃప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తమయ్యింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను మాత్రమే తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇదే సందర్భంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ 19 నిబంధనలు, తల్లిదండ్రుల నుంచి అనుమతి లెటర్లను తప్పనిసరి చేశారు. కరోనా వైరస్‌ విజృంభించిన నేపథ్యంలో 2020-21 విద్యాసంవ్సతరం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని దుస్థితి. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులను బోధిస్తూ ఫీజులను రాబట్టుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ టీచర్ల చొరవతో ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులకు క్లాసులను బోధిస్తూ వచ్చారు. రెండు మార్లు తరగతులను పున:ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కరోనా ఉధృతి నేపథ్యంలో సాధ్యపడలేదు.

ఎట్టకేలకు నవంబర్‌ 2 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్‌ మొదటి, రెండు సంవత్సర తరగతులు రోజు విడిచి రోజు జరగనున్నాయి. అదికూడా ఒకపూట మాత్రమే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 6,7,8 తరగతులకు క్లాసులు నవంబర్‌ 23 నుంచి ప్రారంభించనున్నారు. వీరికి కూడా రోజు విడిచి రోజు ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ప్రైమరీ సెక్షన్‌ పిల్లలు అంటే 1,2,3,4,5 తరగతులు చదివే చిన్నారులకు డిసెంబర్‌ 14 నుంచి స్కూల్‌ను ప్రారంభించనున్నారు. వాళ్లకి కూడా రోజు విడిచి రోజు బడి, ఒక్కపూటే తరగతులు నిర్వహించనున్నారు.

తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని.. విద్యార్థుల పట్ల ప్రభుత్వం పూర్తి శ్రద్ద వహిస్తుందన్నారు. రక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రైవేట్ కాలేజీలు నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినా, విద్యాలయాల్లో అధిక ఫీజు వసూలు చేసినా నియంత్రించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కమిటీలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉంటన్నారని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరోనా నివారణకు ముందుస్తు చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆన్‌లైన్ బోధన, విద్యా వారధి కార్యక్రమం కోసం రోజుకు 22-50 శాతం ఉపాధ్యాయులు హాజరు కావాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. చేతులను తరుచూ సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్ ను అందుబాటులో ఉంచుకోవాలి. పాఠశాల ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధం. అవకాశం ఉన్న వారు ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. పంచాయతీరాజ్, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్ చేయించి అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories