తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి దృశ్యాలు వైరల్

సీసీ కెమెరాలు, ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసం చేసిన పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2024 6:49 PM IST
Scenes Of Police Attack On MLA Pedda Reddy House In Tadipatri Have Gone Viral
X

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి దృశ్యాలు వైరల్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన సీసీ పుటేజీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలింగ్‌ అనంతరం అర్ధరాత్రి భారీ ఎత్తున స్పెషల్ పార్టీ పోలీసులతో పోలీసు అధికారులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు. పెద్దారెడ్డి ఇంట్లోలేడని చెప్పినప్పటికీ తలుపులు బద్దలు కొట్టారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంట్లోని ఫర్నీచర్ పోలీసులు ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలో ఉన్న వైసీపీ కార్యకర్తలను చితకబాదిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ పుటేజీలో రికార్డు అయిన వీడియోలతో వైసీపీ లీగల్ సెల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన సుమారు 11 వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story