కిడ్నాప్‌కు గురైన పెద్దగంజాం సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు సేఫ్

X
కిడ్నాప్‌కు గురైన పెద్దగంజాం సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు సేఫ్
Highlights
*కిడ్నాపర్లను గుర్తించడంలో చీరాల, ఒంగోలు డీఎస్పీల కీలకపాత్ర *30 మందిని వెంటాడి పట్టుకున్న పోలీసులు *వాహనాల్లో కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు లభ్యం
Arun Chilukuri30 Jan 2021 2:00 PM GMT
కిడ్నాప్‌కు గురైన ప్రకాశం జిల్లాలోని పెద్దగంజాం సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావును కిడ్నాపర్ల చెరనుంచి సేవ్ చేశారు పోలీసులు. నిందితులను గుర్తించడంలో కీలకపాత్ర వహించిన చీరాల, ఒంగోలు డీఎస్పీలు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి చిన్నగంజాం మండల వైసీపీ ఇంచార్జ్ అంకమ రెడ్డితో సహా 30 మందిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వాహనాల్లో కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరికాసేపట్లో బాధిత కుటుంబసభ‌్యులకు తిరుపతిరావును అప్పగించనున్నారు. తిరుపతిరావును ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దాచి ఉంచగా పోలీసులు గుర్తించారు.
Web Titlesarpanch candidate who kidnapped in prakasam district have safe
Next Story