ఓటు వేసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

X
ఓటు వేసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
Highlights
సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓ మహిళా అభ్యర్థి పోలింగ్ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణా జిల్లా...
Arun Chilukuri13 Feb 2021 11:18 AM GMT
సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓ మహిళా అభ్యర్థి పోలింగ్ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ పదవికి పోటీ చేస్తోన్న కనకదుర్గ.. రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఉదయం ఓటు వేశారు. కొద్ది సేపటికే నొప్పులు రావడంతో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆడశిశువుకు జన్మనిచ్చారు. కోరుకల్లు పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో నిండు గర్భిణిగానే నామినేషన్ వేసిన కనకదుర్గ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ రోజే బిడ్డకు జన్మనివ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Web TitleSarpanch Candidate Gives Birth to a Baby girl in Andhra Pradesh
Next Story