Rajahmundry: పోలీసు సిబ్బందికి డెటాల్ లిక్విడ్ వితరణ

S. Srikanth
Published on: 26 April 2020 10:40 PM IST
Rajahmundry: పోలీసు సిబ్బందికి డెటాల్ లిక్విడ్ వితరణ
X

రాజమహేంద్రవరం: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాత్రి, పగలు విధినిర్వహణలో ఉంటున్న పోలీసు సిబ్బందికి డెటాల్ బాటిల్స్ ను రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ వై.వి. రమణ కుమార్ వితరణ చేశారు.

తన నెల జీతం లక్షా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలతో 1080 డెటాల్ బాటిల్స్ ను కొనుగోలు చేసి పోలీస్ సిబ్బందికి అందించాలని కోరుతూ అర్బన్ ఎస్పీ షిమౌషి బాజ్పాయ్ కు అందించారు. అర్బన్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ వితరణ స్ఫూర్తిని పలువురు అధికారులు, సిబ్బంది కొనియాడారు.


S. Srikanth

S. Srikanth

Next Story