బెజవాడలో శిశువు అమ్మకం కలకలం.. 50 వేలకు పసిబిడ్డను విక్రయించిన తల్లి

*7 రోజుల శిశువును విక్రయించిన కేసులో ఆరుగురి అరెస్ట్

Jyothi
Published on: 30 Oct 2022 9:52 AM IST
Sale of Baby in Bejawada | AP News
X

బెజవాడలో శిశువు అమ్మకం కలకలం.. 50 వేలకు పసిబిడ్డను విక్రయించిన తల్లి

Vijayawada: బెజవాడలో శిశువు అమ్మకం కలకలం రేగింది. ఏడు రోజుల శిశువును విక్రయించిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైల్డ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు... భానునగర్‌కు చెందిన తల్లి.... శిశువును విక్రయించిట్లుగా పోలీసులకు ఆశావర్కర్లు, స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారుల ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే బెంగళూరుకు చెందిన మాల్యాద్రి, నాగమణిలకు విక్రయించిందని పోలీసులు తెలిపారు. రూ.50 వేలకు పసిబిడ్డను తల్లి విక్రయించిందన్నారు. ఈ శిశువు విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన సత్యవతి, ధనలక్ష్మి, అనిత అనే ముగ్గురు, తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు పోలీసులు... శిశువును చైల్డ్‌లైన్‌‌కు స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారులు పంపారు.

Jyothi

Jyothi

Next Story