Vizianagaram: విజయనగరంలో మహిళా ఎస్సై ఆత్మహత్య

Vizianagaram: విజయనగరంలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 2:26 PM IST
Sakhinetipalli SI Bhavani Suicide in Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో మహిళా ఎస్సై ఆత్మహత్య

Vizianagaram: విజయనగరంలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీ అవివాహితురాలు. అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. కానీ, ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భవానీకి మొదటి పోస్టింగ్ వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story