Sake Sailajanath: ఉత్తరాంధ్రను దోచుకోవడం ఆపండి

Sake Sailajanath: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రని నాశనం చేయకూడదని ఇక్కడ ఉన్న సంపదను దోచుకోకూడదని ఎపి పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 3:42 PM IST
Sake Sailajanath Slams Jagan on Capital City
X

Sake Sailajanath: ఉత్తరాంధ్రను దోచుకోవడం ఆపండి

Sake Sailajanath: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రని నాశనం చేయకూడదని ఇక్కడ ఉన్న సంపదను దోచుకోకూడదని ఎపి పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఉత్తరాంధ్ర జోనల్ శిక్షణా తరగతులకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. ఆనాడు చంద్రబాబు, జగన్మోహనరెడ్డి ఇద్దరూ అనుకొనే అమరావతిని రాజధాని చేసి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు రాయలసీమ, ఉత్తరాంధ్రాకు తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story