Sajjala Ramakrishna Reddy: బాబు కుట్రలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిది..

Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Arun Chilukuri
Published on: 28 Nov 2022 6:42 PM IST
Sajjala Ramakrishna Reddy Welcomes Supreme Courts Judgement on Amaravati
X

Sajjala Ramakrishna Reddy: బాబు కుట్రలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిది..

Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందనేనన్నారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టులో భిన్న తీర్పులు వచ్చాయన్న ఆయన.. అయితే ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సజ్జల. చంద్రబాబు కుట్రలకు ఈతీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. బాబును సీఎం చేయాలన్న పవన్ ప్రయత్నం హాస్యాస్పదంగా ఉందన్నారు సజ్జల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story