Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వాన్ని కూల్చాలని తాపత్రయ పడుతున్నారు..

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2022 2:27 PM IST
Sajjala Ramakrishna Reddy Slams Pawan Kalyan and Chandrababu
X

Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వాన్ని కూల్చాలని తాపత్రయ పడుతున్నారు..

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఇప్పటంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న సజ్జల.. ఆక్రమణలను తొలగించడం తప్పా అంటూ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గత నెలరోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయపడుతున్నారు. అధికారంలోకి రావాలనే వక్రబుద్ధితో ఇదంతా చేస్తున్నారని.. పవన్‌, చంద్రబాబు ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పలగరా అంటూ నిలదీశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించారని సజ్జల విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story