Sajjala: పవన్ ఇండస్ట్రీకి గుదిబండలా తయారయ్యారని సినీ పెద్దలే అంటున్నారు

Sajjala: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 28 Sept 2021 3:46 PM IST
Sajjala Ramakrishna Reddy Slams Pawan Kalyan
X

Sajjala: పవన్ ఇండస్ట్రీకి గుదిబండలా తయారయ్యారని సినీ పెద్దలే అంటున్నారు

Sajjala: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలే ఫీలవుతున్నారన్నారు. పవన్ ఇండస్ట్రీకి గుదిబండలా తయారు అయ్యారని సినీ పెద్దలే అంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి లెక్కలు చూపడం లేదు, ప్రొడ్యూసర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టం వస్తుందని సినీపెద్దలు ప్రభుత్వాన్ని కోరారని తెలిపారాయన. ట్రాన్స్ఫరెన్సీ కోసమే ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామన్నారు. చంద్రబాబు అండ్ కో సినిమా ఇండస్ట్రీలో చేస్తున్న సంస్కరణలను చూసి భయపడుతున్నారని సినిమా ఇండస్ట్రీని గ్యారెంటీగా చూపి ఎవరైనా లోన్స్ తీసుకుంటారా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story