Sajjala Ramakrishna: సమ్మె కంటే ముందే రోడ్డెక్కడం కరెక్ట్ కాదు

Sajjala Ramakrishna: ఉద్యమ కార్యాచరణ మొదలవ్వక ముందే చర్చలు ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని భావించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 2 Feb 2022 4:01 PM IST
Sajjala Ramakrishna Reddy, PRC, Salaries, Government Employees
X

Sajjala Ramakrishna: సమ్మె కంటే ముందే రోడ్డెక్కడం కరెక్ట్ కాదు

Sajjala Ramakrishna: ఉద్యమ కార్యాచరణ మొదలవ్వక ముందే చర్చలు ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని భావించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు పెట్టిన మూడు డిమాండ్లను పక్కన పెట్టి చర్చలకు వస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. వారు ఆ మూడు డిమాండ్ల కోసమే పట్టుబడుతున్నారన్నారు.

చలో విజయవాడ పేరుతో ఎవరి మీద బలప్రదర్శన చేస్తున్నారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందునే పోలీసులు అభ్యంతరం చెప్పి ఉంటారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు తమ ఆందోళనలను విరమించి చర్చలకు రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగిస్తే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ పరిస్థితి వరకూ రానివ్వవద్దని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story