Andhra Pradesh: రైతులపై ప్రతిపక్షం కపట ప్రేమ చూపిస్తుంది- సజ్జల

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 4:14 PM IST
Sajjala Ramakrishna Reddy slams Chandrababu
X

సజ్జల రామకృష్ణ(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. రైతులపై ప్రతిపక్షం కపట ప్రేమను చూపిస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చెల్లించని బకాయిలను జగన్‌ ప్రభుత్వమే క్లియర్‌ చేసిందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం పెరిగిందని చెప్పారు.

టీడీపీ హయాంలోని చీకటి రోజులు ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రజా జీవనాన్ని ఒక గాడిమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం మాదని తెలిపారు. కౌలు రైతులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదని.. చంద్రబాబు లేఖలో రాసిన అంశాలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అని ఆయన కొట్టిపారేశారు. ఆదాయపు పన్ను విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రం, 15వ ఆర్థిక సంఘం సూచనలనే అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story