చంద్రబాబుపై సజ్జల వ్యంగ్యస్త్రాలు

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu
x

చంద్రబాబుపై సజ్జల వ్యంగ్యస్త్రాలు 

Highlights

రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు ధర్నా పేరుతో డ్రామా చేస్తున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని...

రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు ధర్నా పేరుతో డ్రామా చేస్తున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు హామీలను ఎందుకు నెరవేర్చలేదో.. ప్రజలంతా కలిసి చంద్రబాబును నిలదీయాలన్నారు.

గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో ఆందోళన చేశారు. ఇప్పుడు బాబు పబ్లిసిటీ కోసమే ధర్నా చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకక వైసీపీపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సాధిస్తామని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories