Tirupati Bypoll: చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే- సజ్జల

Tirupati Bypoll: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Arun Chilukuri
Published on: 17 April 2021 4:14 PM IST
Sajjala Ramakrishna Reddy Slammed Chandrababu
X

Tirupati Bypoll: చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే- సజ్జల

Tirupati Bypoll: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబ్బద్దాలేనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడం చంద్రబాబుకు అలవాటేనన్న ఆయన ఈవీఎంలు, బ్యాలెట్‌ పైపర్లపై ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మండిపడ్డారు.

ఇక తిరుపతి ఉపఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నవారికి తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు సజ్జల. ఒకసారి కాదు 10 సార్లు ఎన్నిక పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీకి మెజారిటీ పెరగడం తప్ప జరగేదేమీలేదన్నారు. తిరుపతిలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోందని, ఇలాంటప్పుడు కూడా రీపోలింగ్‌కు అనుమతిస్తే సీఈసీ తనను తాను అవమానించుకున్నట్టేనని అన్నారు సజ్జల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story