టీడీపీ ఆవిర్భావ వేడుకలపై సజ్జల సెటైర్స్

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు స్వార్థం కోసం భ్రష్టు పట్టించారు

Jyothi
Published on: 29 March 2022 5:32 PM IST
Sajjala Ramakrishna Reddy Satires On TDP Emergence celebrations
X

టీడీపీ ఆవిర్భావ వేడుకలపై సజ్జల సెటైర్స్

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ చంద్రబాబు హాయంలో ప్రస్తుతం అవసాన దశకు చేరిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టనప్పటి విషయాలను గుర్తు చేసుకుని బాబు మరోసారి ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. కుట్రలు, మేనేజ్మెంట్ లో బాబు డాక్టరేట్ ఇవ్వొచ్చన్న సజ్జల.. ప్రజాక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు తన స్వార్థరాజకీయాలతో కాలగర్భంలో కలిపేశారన్నారు. పార్టీ ఆవిర్భించి 40 ఏళ్ల పూర్తైన సంబురాలు చేసుకుంటున్న ఆపార్టీ నేతలు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలసుకోవాలన్నారు. లేకుంటే ఆపార్టీ నిలదొక్కుకోవడం కష్టమన్నారు సజ్జల.

Jyothi

Jyothi

Next Story