మోడీతో చంద్రబాబు భేటీపై సజ్జల సెటైర్లు.. మోడీనే బాబును పిలిచినట్లు..

Sajjala Ramakrishna Reddy: ప్రధాని మోడీ, చంద్రబాబు భేటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెటైర్లు వేశారు.

Arun Chilukuri
Updated on: 8 Aug 2022 7:45 PM IST
Sajjala Ramakrishna Reddy Satires on Chandrababu
X

మోడీతో చంద్రబాబు భేటీపై సజ్జల సెటైర్లు.. మోడీనే బాబును పిలిచినట్లు..

Sajjala Ramakrishna Reddy: ప్రధాని మోడీ, చంద్రబాబు భేటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెటైర్లు వేశారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారని, ప్రధాని మోడీనే చంద్రబాబుని పిలిచినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో చంద్రబాబు కారణంగా తెలంగాణలో రాహుల్ గాంధీకి ఏమైందని సజ్జల ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల్లో టీడీపీ నేతలు ఉన్నారని అన్నారు.

2019లో ఘోరంగా ఓటమి పాలై వెంటిలేటర్‌ మీదకు చేరుకున్న పార్టీ టీడీపీ అని సజ్జల పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ టీడీపీ ఘోర పరాభవం చూసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు నిద్రలో మళ్లీ తామే వస్తున్నామని అంటూ కలవరింతలు పలుకుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వారికి వారు కార్యకర్తల్లో నిరాశను తొలగించడానికి సెల్ఫ్‌ హిప్నాటిజం చేసుకుంటున్నారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story