మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం.. వారికి పెద్దపీట..

AP Cabinet: ఏపీ మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 2 April 2022 2:41 PM IST
మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం.. వారికి పెద్దపీట..
X

AP Cabinet: ఏపీ మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని సజ్జల తెలిపారు. మొదటి రెండున్నర సంవత్సరాలు కొందరికి, ఆ తర్వాత మరికొందరికి కేబినెట్ లో అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తమ్మీద సీఎం జగన్ నిర్ణయం మేరకే కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. కేబినెట్ లో అవకాశం రానివారు పార్టీ అభివృద్ధికి దోహదపడాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు మంత్రులను కొనసాగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story