చంద్రబాబు, పవన్ భేటీపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. చావులకు కారణమైన వారిని పరామర్శించడం ఏంటి?

Sajjala Ramakrishna Reddy Comments on Pawan Kalyan, Chandrababu
x

చంద్రబాబు, పవన్ భేటీపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. చావులకు కారణమైన వారిని పరామర్శించడం ఏంటి?

Highlights

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు.. చావులకు కారణమైన వారిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలవడం శుభపరిణామమని సీపీఐ రామకృష్ణ అంటున్నారని.. ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమోనని సెటైర్లు వేశారు. బలమైన జగన్‌ను ఎదుర్కోవడానికే వీళ్లంతా ఏకమవుతున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు, పవన్‌లు ఎన్ని పగటి కలలు కన్నా ప్రజాబలం ఉన్న జగన్‌నీ ఏమీ చెయ్యలేరు. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం అవటాన్ని జనం చూడాలి. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్తారు అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories