Sajjala: రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా కేసీఆర్ ఉంటానన్నారు

Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 2 July 2021 4:05 PM IST
Sajjala Ramakrishna Reddy About Water Dispute
X

సజ్జల రామకృష్ణారెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జల వివాదం పరిష్కారం కావాలనే ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని తెలిపారు. ఉభయరాష్ట్రాల మధ్య సీఎంల మీటింగ్‌లో తానున్నానని గుర్తు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యమన్నారు.

శ్రీశైలంలో 800 అడుగుల లోతులో కృష్ణానీటిని తీసుకోవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని సజ్జల అన్నారు. రాయలసీమ నీటి విష‍యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్దన్నగా ఉంటానని గతంలోనే హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story