ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా..

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా..
x
Highlights

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ ను ఏఐసీసీ నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌‌లుగా తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని ఎంపిక చేసింది. ఈ...

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ ను ఏఐసీసీ నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌‌లుగా తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవి కోసం ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవిని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శైలాజానాధ్‌ను ఎంపిక చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories