Nara Lokesh: రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ

Nara Lokesh: మీ ఉడత బెదిరింపులకు మేం భయపడం

Shekhar G
Published on: 2 Oct 2023 6:21 PM IST
Said Nara Lokesh Further Action Depends On Supreme Court Verdict Tomorrow
X

Nara Lokesh: రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ

Nara Lokesh: ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలతో కలిసి లోకేష్ చేపట్టిన ఒక్కరోజు దీక్ష పూర్తయింది. జగన్ సైకో జగన్ కాదు ఆయన పిచ్చి జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎటువంటి ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని తెలిపారు. చంద్రబాబు వల్ల పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చాయన్న లోకేష్.. చంద్రబాబును జైలుకు పంపడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారన్నారు. తనకు సంబందంలేని శాఖలో కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని లోకేష్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story