Srisailam Reservoir: శ్రీశైలం డ్యాంను పరిశీలించిన సేఫ్టీ రివ్యూ కమిటీ బృందం

Srisailam Reservoir: కమిటీ చైర్మన్ పాండియన్‌ అధ్యక్షతన 20 మంది సభ్యుల పరిశీలన

Rama Rao
Published on: 3 Jan 2022 3:58 PM IST
Safety Review Committee team inspecting Srisailam Reservoir
X

శ్రీశైలం డ్యాంను పరిశీలించిన సేఫ్టీ రివ్యూ కమిటీ బృందం

Srisailam Reservoir: శ్రీశైలం డ్యాంను సేప్టీ రివ్యూ కమిటీ బృందం పరిశీలించింది. శ్రీశైల జలాశయాన్ని ఉదయం డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసింది. కమిటీ చైర్మన్ పాండియాన్ అధ్యక్షతన 20 మందితో కూడిన బృందం శ్రీశైలం డ్యాంను రెండురోజులపాటు పరిశీలించనుంది. డ్యాం రీ హాబిటేషన్ అండ్ ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. దేశంలో మేజర్ ప్రాజెక్టుల అధ్యయనాన్ని సీడబ్ల్యూసీకి అందజేయనున్నారు. అందులో భాగంగా ఏపీలోని శ్రీశైలం డ్యామ్, ధవళేశ్వరం ఆనకట్టలను పరిశీలిస్తున్నట్లు చైర్మన్ పాండియాన్ వెల్లడించారు.

Rama Rao

Rama Rao

Next Story