కన్నీటి పర్యంతమైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల

* తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మంజుల

R Tripura Malini
Published on: 12 Dec 2022 1:48 PM IST
RTC Regional Chairman Manjula Was Teary Eyed
X

కన్నీటి పర్యంతమైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల

Ananthapur: అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల కన్నీటి పర్వంతమయ్యారు. సభా వేదిక పైకి తనను ఆహ్వానించలేదని కన్నీరు పెట్టుకున్నారు. చైర్మన్ అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని, ఓ స్థాయి పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆమె తరఫు కార్యకర్తలు విమర్శించారు. ఆమె కన్నీటి పెట్టుకున్న విషయాన్ని గమనించిన కొంతమంది నాయకులు సర్ది చెప్పి వేదిక పైకి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story