Tirumala: తిరుమల కర్ణాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం

Tirumala: వేగంగా దూసుకువచ్చిన బస్సు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది

Sandeep Eggoju
Published on: 25 April 2021 10:02 AM IST
RTC bus Accident Thirumala Karnala Street
X

Representational Image

Tirumala: తిరుమల కర్ణాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన బస్సు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అంతేకాదు బస్సు బీభత్సానికి 3 బైక్‌లు కూడా ధ్వంసంమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళా అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story