బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి...

West Godavari: ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు...

Shireesha
Published on: 15 Dec 2021 1:26 PM IST
RTC Bus Accident Killed 8 Member in West Godavari Today 15 12 2021 | AP Live News
X

బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి...

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. ప్రమాదంలో ఎనిమిది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు.

ఆర్టీసీ బస్సు అశ్వారావు పేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story