విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. డ్రైవర్‌కు మూర్ఛ

* రోడ్డుపక్కకు దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో విద్యార్థి మృతి

R Tripura Malini
Published on: 20 Nov 2022 12:34 PM IST
RTC bus accident in Vizianagaram district, bus driver fainted
X

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. డ్రైవర్‌కు మూర్ఛ

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సు ఢీకొని 7వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అనంతరం రోడ్డుపక్కనున్న ఇంట్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటిగోడ కూలి మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. మిగతావారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story