ఆ టీషర్ట్‌ వల్లే నాన్నను గుర్తించగలిగా.. ఈ పరిస్థితుల్లో నాన్నను చూడాల్సి వస్తుందని..

ఆ టీషర్ట్‌ వల్లే నాన్నను గుర్తించగలిగా.. ఈ పరిస్థితుల్లో నాన్నను చూడాల్సి వస్తుందని..
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటును గోదావరి నుంచి బయటికి తీయడంతో బాధితుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. తమవారిని కనీసం చివరి చూపు...

తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటును గోదావరి నుంచి బయటికి తీయడంతో బాధితుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డారు. అయితే, వెలికితీసిన బోటులో ఎనిమిది మృతదేహాలు దొరికినా అవన్నీ కుళ్లిపోయి చిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది.

రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఎనిమిది మృతదేహాల్లో ఐదుగురిని గుర్తించారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని ఆ‍యన కుటుంబ సభ్యులు గుర్తించారు. నూకరాజు మృతదేహాన్ని గుర్తించిన అతని కుమారుడు బోరున విలపించాడు. 39రోజుల తర్వాత తన తండ్రిని ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి మూడేళ్లుగా రాయల్ వశిష్ట బోటులో పనిచేస్తున్నాడని, టీషర్ట్ ఆధారంగా గుర్తించానని నూకరాజు కుమారుడు తెలిపాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories