నెల్లూరులో మరోసారి రెచ్చిపోయిన రౌడీ మూకలు

నెల్లూరులో మరోసారి రెచ్చిపోయిన రౌడీ మూకలు
x

నెల్లూరులో మరోసారి రెచ్చిపోయిన రౌడీ మూకలు

Highlights

*బీవీనగర్‌‌లో యువకుడిపై విచక్షణారహితంగా దాడి *ఇటుకలతో ఇష్టానుసారంగా కొట్టిన రౌడీ మూకలు

నెల్లూరులో మరోసారి రౌడీ మూకలు రెచ్చిపోయారు. బీవీనగర్‌ శివారులో యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఇటుకలు, రాళ్లతో ఇష్టానుసారంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే ఈ దాడి చేశారు. పారిపోతున్న బాధితుడిని వెంటబడిమరీ కొట్టారు. మూడ్రోజులక్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్లూరు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే, నెల్లూరులో పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలోనూ నెల్లూరులో ఇలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడిని రౌడీ మూకలు విచక్షణారహితంగా కొట్టారు. కొట్టొద్దంటూ వేడుకుంటున్నా కనికరించకుండా చితకబాదారు. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనమైంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో రౌడీ మూకలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ ఘటనను మరువక ముందే మరోసారి అలాంటి ఘటన జరగడం నెల్లూరులో కలకలం రేపుతోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రెచ్చిపోతున్న రౌడీ మూకలు, పోకిరీలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories