అమరావతిలో మళ్లీ వార్

అమరావతిలో మళ్లీ వార్
x
అమరావతి
Highlights

ఏపీ రాజధాని అమరావతిపై రౌండ్ టేబుల్స్ వేదికగా ఇవాళ రచ్చ జరుగుతోంది. ఓ వైపు టీడీపీ విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం...

ఏపీ రాజధాని అమరావతిపై రౌండ్ టేబుల్స్ వేదికగా ఇవాళ రచ్చ జరుగుతోంది. ఓ వైపు టీడీపీ విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుండగా రాజధాని గ్రామాల్లోని టీడీపీ వ్యతిరేక రైతు వర్గం కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది.

అమరావతిలో పోటాపోటీ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఓ వైపు రాజధానిలో తమకు చంద్రబాబు సీఎంగా చేసిన అన్యాయాన్ని అఖిలపక్షం ముందు ఉంచుతామని రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు చెబుతుంటే మరికొందరు రైతులు మాత్రం చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్థి పనులను జగన్ సర్కార్ నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో రెండు వర్గాలుగా విడిపోయిన రైతులు రాజధానిపై చర్చకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి జరిగింది. దీంతో విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ నేతలు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

మరోవైపు టీడీపీ నిర్వహించే అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యతిరేకంగా రాజధాని - వాస్తవాలు పేరుతో29 గ్రామాల రైతుల ఆధ్వర్యంలో తుళ్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఆర్డీయే పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో అమరావతిపై మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది.

మొన్నటిదాకా రాజధానికి భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై ఆందోళన చేస్తే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో అసలు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. భూసేకరణలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు, ప్రభుత్వానికీ తెలిసేలా తాము సమావేశం నిర్వహిస్తున్నామని ఓ వర్గం రైతులు చెబుతున్నారు. గ్రామ కంఠాలు, అసైన్డ్ భూములు, కౌలు రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించకుండా మాజీ సీఎం చంద్రబాబు వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. తుళ్లూరు వేదికగా జరిగే ఈ సమావేశంలో అన్ని అంశాలను వివరించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు రైతులు.

మొత్తానికి రాజధానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో రగడ మొదలైంది. పోటాపోటీ రౌండ్ టేబుల్‌ సమావేశాలతో అమరావతి దద్ధరిల్లుతోంది. మరి ఈ రౌండ్ టేబుల్స్ రగడతో రాజధానిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories