అనంతపురం జిల్లా పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Ananthapur: మినీ వ్యాన్ బోల్తా, ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

Jyothi
Published on: 20 Feb 2022 10:14 AM IST
Road Accident Near Pulagampalli in Ananthapur District
X

అనంతపురం జిల్లా పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Ananthapur: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే మినీ వ్యాన్ బోల్తా పడిందని తెలుస్తోంది. మరో కిలోమీటర్ వెళితే అంతా ఇంటికి చేరేవారు. ఈలోపే ప్రమాదం జరగడంతో పులంగిపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది.

Jyothi

Jyothi

Next Story