వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం

Arun Chilukuri
Published on: 2 Sept 2020 9:52 AM IST
వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం
X

Road Accident: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను ప‌ర్య‌వేక్షించారు. చనిపోయిన వారు కారులోనే ఇరుక్కుపోయారంటే ప్ర‌మాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

మృతదేహాల్ని అతి కష్టం మీద కారు నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వాళ్లంతా వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరణించిన వారిని చందు, మేకల రాకేశ్‌, పవన్, రోహిత్‌, సాబీర్‌‌గా‌ గుర్తించారు. వారంతా ములుగువైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story