విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
రోడ్డు ప్రమాదం
Highlights

విశాఖ జిల్లా కశింకోట మండలం గొబ్బూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ‌్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

విశాఖ జిల్లా కశింకోట మండలం గొబ్బూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ‌్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులు బుచ్చయ్యపేట మండలం ఆర్‌. శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పని నిమిత్తం మునగపాక మండలం యాదగిరి పాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్‌ రాంగ్‌ రూట్‌లో రావడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories