Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 22 Dec 2023 5:14 PM IST
Road Accident in Prakasam District
X

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం దగ్గర ఓ కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తోన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను మార్కాపురం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story