ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రోడ్డు ప్రమాదం

NTR District: గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీని ఢీకొట్టిన మరో లారీ

Jyothi
Updated on: 2 Aug 2022 11:36 AM IST
Road Accident in NTR District
X

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రోడ్డు ప్రమాదం

NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణం శివారులోని గ్యాస్ కంపెనీ సమీపంలో ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లలో డ్రైవర్లు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంరతం తీవ్రంగా శ్రమించి డ్రైవర్లను బయటకు తీశారు. ఒక లారీలోని డ్రైవర్ మృతి చెందగా, మరో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story