నెల్లూరు జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలు

Road Accident In Nellore | AP News
x

నెల్లూరు జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలు

Highlights

Road Accident: భవాని భక్తులతో ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన కంటైనర్

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నంబర్ జాతీయ రహదారిపై సున్నపు బట్టి దగ్గర భవాని మాల భక్తులతో వెళుతున్న ఆటోను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులతో పాటు బాధితులు అందరూ అల్లూరు మండలం సింగపేట పంచాయతీలోని చెలికల సంఘానికి చెందిన వారిగా గుర్తించారు. కోవూరులో జరిగిన ఓ భజన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories