Road Accident: మునగచర్ల నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 15 మంది ప్రయాణికులకు గాయాలు

Road Accident: నందిగామ ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

Jyothi
Published on: 25 Aug 2023 9:24 AM IST
Road Accident in Nandigama of NTR District
X

Road Accident: మునగచర్ల నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 15 మంది ప్రయాణికులకు గాయాలు

Road Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగచర్లలోని నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story