ఇద్దరు చిన్నారులను బలిగొన్న కంటైనర్

X
Highlights
తూర్పుగోదావరి జిల్లా తునిలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్నవారిని కంటైనర్ లారీ అతివేగంగా వచ్చి...
Arun Chilukuri20 Dec 2020 5:28 AM GMT
తూర్పుగోదావరి జిల్లా తునిలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్నవారిని కంటైనర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన నుంచి తండ్రి తప్పించుకోగా ఇద్దరు చిన్నారులు లారీ చక్రాల కిందపడి నుజ్జునుజ్జయ్యారు. మృతులు దుర్గ, తాతాజీలుగ గుర్తించారు. విగతజీవులుగా పడిఉన్న చిన్నారుల దగ్గర గుండెలు పగిలేలా రోదిస్తున్న తండ్రిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీకి చెందినదిగా గుర్తించారు పోలీసులు. ఇటుకల బట్టీలో పనిచేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Web Titleroad accident in East Godavari district two children died
Next Story