Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్​లోనే నలుగురు మృతి..

Road Accident: అన్నమయ్య జిల్లా కడప - చిత్తూరు హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ వద్ద ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Oct 2024 6:45 AM IST
Road Accident in Annamayya District
X

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్​లోనే నలుగురు మృతి..

Road Accident: అన్నమయ్య జిల్లా కడప - చిత్తూరు హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ వద్ద ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే సీఎంఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు అన్నమయ్య జిల్లాలో కడప-చిత్తూరులో హైవేలోని కలకడ మండల కేంద్రం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మరికొంతమందికి తీవ్ర గాయాలు పాలైనట్లు తెలుస్తోంది.

మృతులు కలికిరి మండలం చంద్రవారి పల్లి పంచాయతీ దూదేకులపల్లికి చెందిన ఖాదరవల్లి (35), నిలిమందకు చెందిన నూరుల్లా (32), చెండావారిపల్లి పంచాయతీ దూదేకులపల్లికి చెందిన బుజ్జమ్మ(60) నెల్లిమందకు చెందిన పకీరమ్మ (65)లు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ గురునాథ్, ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story