Road Accident in Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Arun Chilukuri
Published on: 9 July 2020 11:25 AM IST
Road Accident in Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

Road Accident in Anantapur : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ముగ్గురు మరణించారు. రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారు బుక్కరాయసముద్రం మండలం సిద్ధ రాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుంచి అనంతపురం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం ఏంటి డ్రైవర్ నిర్లక్ష్యమా అతి వేగమా ప్రమాదవశాత్తూ జరిగిందా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story