బస్సు ప్రమాదంలో మరణాలు

బస్సు ప్రమాదంలో మరణాలు
x
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్‌ను ఓ కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కాగా ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే అనే తెలుస్తోంది. నిద్రమత్తులో కారును అతి వేగంగా పోనిచ్చాడు.. దాంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్‌ ట్రావెల్స్ బస్సును ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డారు. మృతులు ముగ్గురు అనంతపురం జిల్లా రేణుమాకులపల్లికి చెందిన మోహన్ కృష్ణ, సోదనపల్లికి చెందిన అనీల్ కుమార్‌రెడ్డిగా, బెంగుళూరుకు చెందిన అబ్దుల్‌ ముజీబ్‌గా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories