శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Sri Sathya Sai District: క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

Shekhar G
Published on: 3 Sept 2023 2:54 PM IST
Road Accident At Yerradoddi In Sri Sathya Sai District
X

శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి  

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం ఎర్రదొడ్డి వద్ద ఎదురుగా వస్తున్న ఆటో- కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ముదిగుబ్బ మండలం మదిరేబైలు తండాకు చెందిన చిన్నస్వామి నాయక్, భాస్కర్ నాయక్, రెడ్డివారిపల్లితండాకు చెందిన చలపతి నాయక్ గా గుర్తించారు. మృతుల్లో చిన్నస్వామి నాయక్ మదిరేబైలు పంచాయతీ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story