RK Roja: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేదు

RK Roja: సీఎం సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2024 11:04 AM IST
RK Roja: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేదు
X

RK Roja: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేదు

RK Roja: సీఎం సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్యచేసిన ఉదంతం గుండెను పిండేస్తుందన్నారు. తమకూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కాపాడలేకపోయారని. నాలుగు రోజుల తర్వాత సమీప ప్రాంతంలోనే బాలిక శవమై కనిపించిందంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు.

ఇది ప్రభుత్వ అసమర్ధత కాదా అన్నారు. లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే వీళ్లకు పాలించే అర్హత ఉందా అన్నారు. మాజీ సీఎం జగన్ పుంగనూరు వస్తున్నారంటే హోంమంత్రి పరుగులు తీస్తున్నారన్నారు. ఇప్పటికైనా పుంగనూరు ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story