Chodavaram: సీఐటీయూ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం, కూరగాయల పంపిణీ

S. Srikanth
Published on: 21 April 2020 8:07 AM IST
Chodavaram: సీఐటీయూ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం, కూరగాయల పంపిణీ
X

చోడవరం: సీఐటీయూ ఆధ్వర్యంలో చోడవరంలోని ఆటో, రిక్షా, పారిశుద్ధ్య, ఇటుక పని వలస కార్మికులకు సుమారు వంద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సీఐటీయూ నాయకురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ... మధ్యాహ్న భోజన కార్మికులు, కొంతమంది యువకులు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, లాక్ డౌన్ వలన ఇటుక బట్టిల్లో వలస కార్మికులు వందల మంది ఇబ్బందిపడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా కరోనా ప్రభావంతో పనులు లేక బిల్డింగ్, ఆటో, ముఠా కార్మికులు తిండికి కూడా నానా అవస్థలు పడుతున్నారని...వారిని కూడా ఆదుకోవాలని సీఐటీయూ తరపున కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూనూరు వరలక్ష్మి, ప్రేమ్ చంద్రశేఖర్, గూనూరు శివకుమార్, హేమంత్ కుమార్, చిరంజీవి పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story