చంద్రబాబుకు నోటీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని..

Renigunta Police Serves Notice to Chandrababu
x

చంద్రబాబుకు నోటీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని..

Highlights

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు...

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్ట్‌కు అయినా వెనుకాడబోమని లేఖలో తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు ఎస్‌ఈసీ అనుమతి తీసుకున్నట్టు తమ దృష్టికి రాలేదని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుకు విఘాతం కలిగించొద్దని కోరారు పోలీసులు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories