అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విగ్రహం తొలగింపు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన వర్సిటీ అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Jun 2024 3:46 PM IST
Removal of idol at Sri Krishnadevaraya University, Anantapur
X

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విగ్రహం తొలగింపు

అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వర్సిటీ అధికారులు తొలగించారు. భారీ భద్రత మధ్య రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికార బలంతో బలవంతంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే.. గత కొన్ని రోజులుగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు ఉండకూడదని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో విగ్రహాన్ని తొలగించాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. భారీ పోలీసుల భద్రత నడుమ విగ్రహాన్ని తొలగించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story