Remdevisir: విశాఖలో రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్

Remdevisir: రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌లో అమ్ముతున్న కార్పొరేట్ ఆస్పత్రులు

Sandeep Eggoju
Updated on: 20 April 2021 12:56 PM IST
Remdevisir Black Marketing In Visakhapatnam
X

రెమ్ దేసివిర్ (ఫైల్ ఇమేజ్)

Remdevisir: విశాఖలో రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ దందా వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు. విశాఖలోని ఓమ్నీ ఆస్పత్రిలో ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందా బయటపడింది. ఏకంగా 10వేల రూపాయలకు రెమ్‌డెసివిర్‌ను విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌లో అమ్ముతుండగా ఆస్పత్రి సిబ్బందిని విజిలెన్స్‌ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి నర్సుతోపాటు హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌, మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. విచారణ చేపట్టిన అధికారులు రెండ్రోజుల్లోనే 7 ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్మినట్లు గుర్తించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story