Remdesivir: విశాఖలో రెమిడిసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ దందా

Remdesivir: విశాఖలో రెమిడిసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ దందా కొనసాగుతూనే ఉంది.

Sandeep Eggoju
Updated on: 15 May 2021 2:33 PM IST
Remdesivir Injunctions Black Marketing in Visakhapatnam
X

రెండేసివిర్ (ఫైల్ ఇమేజ్)

Remdesivir: విశాఖలో రెమిడిసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ దందా కొనసాగుతూనే ఉంది. బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని, భారీగా డబ్బు దోచుకుంటున్నారు కొందరు నిందితులు. విషయం తెలుసుకున్న డ్రగ్స్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. రెమిడిసివర్‌ ఇంజక్షన్ల ముఠాతో పేషెంట్‌ బంధువుల్లా మాట్లాడారు. ఒక్కో ఇంజక్షన్‌ను 35వేలకు అమ్ముతున్నట్టు చెప్పిన ముఠా.. 6 వయల్స్‌ను 2లక్షల 10వేలకు విక్రయించే ప్రయత్నం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ అధికారులు.. వారిని ఎంవీపీ పోలీసులకు అప్పగించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story